From Thinking to Knowing: Why Knowledge Was Never Meant to Be Disembodied-ఆలోచించడం నుంచి తెలుసుకోవడం వరకు: జ్ఞానం ఎందుకు శరీరానికి వేరుగా ఉండకూడదు – డా. సాయి ఆచార్య

ఆలోచించడం నుంచి తెలుసుకోవడం వరకు: జ్ఞానం ఎందుకు శరీరానికి వేరుగా ఉండకూడదు 

ఇప్పటి కాలంలో మన దగ్గర చాలా సమాచారం ఉంది. కానీ ఒక పెద్ద తప్పు జరుగుతోందిఆలోచించడమే  జ్ఞానం అని మనం భావిస్తున్నాం. వ్యాసం చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన అసలు సమస్య అజ్ఞానం కాదు. అసలు సమస్య శరీరంతో కలవని జ్ఞానం. అంటే, మనం తెలుసుకున్న ఆలోచనలు మన చర్యల్లో, మన రోజువారీ జీవితంలో కనిపించడం లేదు. ఇప్పటి శాస్త్రాలు చెప్పే “embodied cognition” అనే ఆలోచనతో పాటు, మన భారతీయ జ్ఞాన వ్యవస్థ మరియు సాంప్రదాయాలైన Upanishads, Natya Shastra, Yoga Sutras of Patanjali కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. వ్యాసం జ్ఞానాన్ని కొత్తగా నిర్వచిస్తుంది. జ్ఞానం అంటే కేవలం మైండులో  ఉండే ఆలోచన కాదు. అది మనసు (mind), శరీరం (body), చర్య (action)— మూడూ కలిసి పనిచేసే ప్రక్రియ. మనకు నిజంగా అర్థమైందని చెప్పేది, మనం ఎంత బాగా explain చేయగలమో కాదు. మనము దాన్ని ఎంత స్థిరంగా ఆచరించగలమో అదే నిజమైన జ్ఞానం. అందుకే వ్యాసం ఒక మార్పును సూచిస్తుందిసమాచారం (information) నుంచి మార్పు (transformation) వైపు, ఆలోచనల నుంచి అనుభవం (embodiment) వైపు వెళ్లాలి. అంటే, తెలుసుకోవడం మాత్రమే కాదుజీవితంలో ఆచరించడం లేదా జీవించడమే నిజమైన జ్ఞానం.

ChatGPT-Image-Apr-20-2026-at-10_47_23-PM-300x200.png

పరిచయం: కేవలం ఆలోచించడం సరిపోదు

ఇప్పటి కాలంలో జ్ఞానం అంటే ఎక్కువగా ఆలోచించడం, చెప్పడం, విశ్లేషించడం అని భావిస్తున్నారు. ఎవరు స్పష్టంగా explain చేయగలరో, బలంగా వాదించగలరో, తమ ఆలోచనలను చక్కగా వ్యక్తపరచగలరో వాళ్లనే ఎక్కువగా తెలివైనవారిగా చూస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు స్పష్టమైన ఆలోచనలను ప్రోత్సహిస్తున్నాయి, ఉద్యోగాల్లో వేగంగా విశ్లేషించగలిగినవారికి విలువ పెరుగుతోంది, సోషల్ మీడియాలో త్వరగా కొత్త ideas చెప్పగలిగినవాళ్లు ఎక్కువగా గుర్తింపు పొందుతున్నారు. కానీ ఈ అన్నిటి మధ్యలో ఒక ముఖ్యమైన చిన్న అసంతృప్తి ఉంది—ఏదో ముఖ్యమైనది మిస్ అవుతోంది అన్న భావన మనలో కలుగుతోంది.

మన పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. మనకు ఇప్పటివరకు ఎన్నడూ లేనంత సమాచారం ఉంది… కానీ మన జీవితం అంతగా మారడం లేదు. మనం ఆరోగ్యం గురించి చాలా బాగా మాట్లాడగలం, కానీ మనం ఆరోగ్యంగా జీవించడం లేదు. మనం నీతి, విలువల గురించి గొప్పగా చెప్పగలం, కానీ క్లిష్ట పరిస్థితుల్లో వాటిని ఆచరించడం కష్టమవుతోంది. మనం ధ్యాస, దృష్టి, అవగాహన గురించి తెలుసు, కానీ రోజువారీ జీవితంలో మనసు చెదురుమదురుగానే ఉంటుంది.

ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మనం జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో అందులో ఉన్న ఒక లోతైన సమస్యను చూపిస్తోంది. మన సమస్య జ్ఞానం లేకపోవడం కాదు. మన సమస్య జ్ఞానం మన జీవితంతో కలవకపోవడం. అంటే, మనం తెలుసుకున్నది మనం చేసే పనిలో కనిపించడం లేదు. ఆలోచన ఒక వైపు, చర్య మరో వైపు—ఇవి రెండూ కలిసిపోవడం లేదు. కాబట్టి అసలు సమస్య మనం ఎక్కువగా ఆలోచించడం కాదు. మన పెద్ద తప్పు ఏమిటంటే—ఆలోచించడమే జ్ఞానం అని నమ్మడం.

Mental Activity యొక్క చారిత్రక నిర్మాణం 

మనకు ఇప్పుడు ఉన్న జ్ఞానం గురించి అర్థం ఒక్కరోజులో ఏర్పడలేదు. అది చాలా సంవత్సరాల ఆలోచనల, తత్వశాస్త్రాల ప్రయాణంలో మెల్లగా ఏర్పడింది. కాలక్రమంలో మనుషులు “నిజం తెలుసుకోవాలంటే మెదడు ముఖ్యమైనది” అని భావించడం ప్రారంభించారు. మొదట్లో వచ్చిన తత్వవేత్తల ఆలోచనల నుంచి, తర్వాత వచ్చిన విజ్ఞానోదయం (Enlightenment) కాలం వరకు—జ్ఞానం అంటే ఎక్కువగా ఆలోచించడం, తర్కించడం, విశ్లేషించడం అని భావించబడింది. దీని వల్ల విజ్ఞానం, సాంకేతికత, పరిశోధనలలో చాలా పెద్ద పురోగతి వచ్చింది.

కానీ ఇదే సమయంలో ఒక ముఖ్యమైన విషయం జరిగింది— మనసు (mind) మరియు శరీరం (body) మధ్య ఒక దూరం ఏర్పడింది. ఈ విధానంలో శరీరాన్ని తక్కువగా చూసారు. అది కేవలం ఒక సాధనం మాత్రమే అని భావించారు—నియంత్రించాల్సినది, శిక్షణ ఇవ్వాల్సినది, అవసరమైతే దాటిపోవాల్సినది కూడా అని భావించారు. దీంతో “తెలుసుకోవడం” అంటే ఒక లోపలి మానసిక ప్రక్రియగా మారింది: అంటే విషయాలను అర్థం చేసుకోవడం, వర్గీకరించడం, వివరించడం, చెప్పడం.

పాఠశాలలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి. వినడం చేయడం కంటే ముఖ్యం అయింది. సిద్ధాంతం (theory) ఆచరణ (practice) కంటే ముఖ్యమైంది అయింది. మాటల్లో చెప్పడం, నిజంగా జీవించడం కంటే విలువైంది అయింది. ఈ విభజనను René Descartes అనే తత్వవేత్త బలంగా చెప్పాడు. ఆయన మనసు మరియు శరీరం వేర్వేరు అని భావించాడు. “నేను ఆలోచిస్తున్నాను, కాబట్టి నేను ఉన్నాను” అనే ఆయన భావన చాలా ప్రభావం చూపింది.

తర్వాత చాలా మంది ఈ ఆలోచనను ప్రశ్నించినా, ఈ విధానం ఇప్పటికీ మన విద్యా వ్యవస్థలో, ఆలోచనలో బలంగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే— మనకు విషయాలు బాగా అర్థమవుతున్నాయి, కానీ మనం వాటిని పాటించడం లేదు జీవించడం లేదు. మనకు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసు, కానీ వాటిలో ఎలా జీవించాలో తెలియదు. నిజం గురించి చెప్పగలం, కానీ దానితో ఎలా కలవాలో తెలియదు. అంటే, ఈ విధానం మనకు “చెప్పడానికి” జ్ఞానం ఇస్తుంది… కానీ “మారడానికి” మాత్రం పూర్తిగా సహాయపడటంలేదు.

శరీరంతో కలిసిన లేదా మూర్తీభవించిన జ్ఞానం: మనిషి మొత్తం వ్యవస్థను తిరిగి గుర్తించడం

ఇటీవలి సంవత్సరాల్లో, వివిధ శాస్త్రాల్లో జరిగిన పరిశోధనలు ఒక ముఖ్యమైన విషయాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటివరకు మనం అనుకున్నట్టుగా జ్ఞానం కేవలం మెదడులోనే ఉండదు. అది మన మొత్తం శరీరం మరియు మన పరిసరాలతో కలిసి పనిచేస్తుంది అని ఇప్పుడు స్పష్టమవుతోంది. కాగ్నిటివ్ సైన్స్, ఫెనామినాలజీ, న్యూరోసైన్స్ వంటి రంగాలు—అన్నీ కలిసి ఒకే విషయాన్ని చెబుతున్నాయి: ఆలోచించడం అంటే కేవలం మెదడు పని కాదు. అది శరీరం మొత్తం చేసే పని.

Maurice Merleau-Ponty వంటి తత్వవేత్తలు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు— మనకు శరీరం ఉంది కాదు… మనమే శరీరం. అంటే మనం ప్రపంచాన్ని తెలుసుకోవడం అంటే, మన శరీరం ద్వారా తెలుసుకోవడం. ఇంకా మన ఆలోచనలు, భాష, నిర్ణయాలు అన్నీ మన అనుభవాల మీదే ఆధారపడి ఉంటాయి. మనం చూసింది, విన్నది, కదిలింది—ఇవి అన్నీ కలిసి మన జ్ఞానాన్ని తయారు చేస్తాయి అని Francisco Varela మరియు George Lakoff వంటి శాస్త్రవేత్తలు చూపించారు.

ఈ విధానాన్ని “embodied cognition” అని అంటారు. దాని అర్థం సింపుల్‌గా చెప్పాలంటే: జ్ఞానం అంటే కేవలం ఆలోచన కాదు, అది జీవించడం. ఇది Michael Polanyi చెప్పిన “tacit knowledge” అనే భావనతో కూడా సరిపోతుంది. ఆయన చెప్పినట్టు, మనకు చాలా విషయాలు తెలుసు… కానీ వాటిని మాటల్లో పూర్తిగా చెప్పలేం. మన రోజువారీ జీవితంలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నర్తకి కఠినమైన నృత్యాన్ని చేయడానికి ప్రతి కదలిక గురించి ఆలోచించదు—ఆమె శరీరం ద్వారా అది జరుగుతుంది. ఒక సంగీతకారుడు ప్రతి స్వరాన్ని లెక్కించడు—ఆయన లయలో జీవిస్తాడు. ఒక డాక్టర్ (surgeon) శస్త్రచికిత్సలో ఖచ్చితత్వాన్ని కేవలం చదివి నేర్చుకోడు—అది చాలా సార్లు practice చేసి శరీరంలో స్థిరపడుతుంది. జ్ఞానం అనేది మన దగ్గర ఉన్న సమాచారం కాదు. మనం చేయగలిగే శక్తి. అది అనుభవం ద్వారా వస్తుంది. చేయడం ద్వారా మెరుగుపడుతుంది. మళ్లీ మళ్లీ practice చేయడం ద్వారా మనలో స్థిరపడుతుందని ఈ ఉదాహరణలు మనకు ఒక స్పష్టంగా  చెబుతున్నాయి. అంటే, నిజమైన జ్ఞానం తలలో కాదు…మన శరీరం, మన చర్యల్లో కనిపించాలి.

చెప్పగలగడం మరియు చేయగలగడం మధ్య ఉండే గ్యాప్

ఇప్పుడిప్పుడే చాలా పరిశోధనలు జ్ఞానం అంటే శరీరంతో కలిసినదని చెబుతున్నప్పటికీ, మన విద్యా వ్యవస్థలు ఇంకా ఎక్కువగా పుస్తకాల జ్ఞానం (conceptual knowledge) మీదే దృష్టి పెడుతున్నాయి. అంటే, మనం అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, చెప్పడం—ఇవే ముఖ్యమవుతున్నాయి. దీని వల్ల ఒక పెద్ద సమస్య వస్తోంది. మనకు తెలిసినది మరియు మనం చేయగలిగినదానికి మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతోంది. ఈ గ్యాప్ మనం రోజూ చూస్తున్నాం. మనకు కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం అని తెలుసు… కానీ ఒత్తిడి వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. మనకు దృష్టి (focus) చాలా అవసరం అని తెలుసు… కానీ మనసు ఎక్కువసేపు ఒక పనిపై నిలబడడం లేదు. మనకు నీతి విలువలు తెలుసు… కానీ కష్టమైన పరిస్థితుల్లో వాటిని ఆచరించడం కష్టమవుతోంది.

ఇది చూసి చాలా మంది “మనలో discipline లేదు”, “మనలో willpower తక్కువ” అని అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. నిజానికి సమస్య ఏమిటంటే— మన ఆలోచన (thinking) మరియు మన చర్య (action) ఒకే స్థాయిలో లేవు. మనకు మనుసులో అర్థమవుతోంది… కానీ అది శరీరంలో, మన ప్రవర్తనలో ఇంకా స్థిరపడటంలేదు.

అంటే, ఆలోచన స్థాయిలో తెలుసుకోవడం జరుగుతోంది కానీ చర్య (Action) స్థాయిలో తెలుసుకోవడంగా మారడం లేదు. ఇక్కడ అవసరమైనది ఒక ముఖ్యమైన ప్రక్రియ—integration (ఏకీకరణ). అంటే, మనం నేర్చుకున్నది మన చూపులో, మన ప్రవర్తనలో, మన ప్రతిస్పందనలో కనిపించాలి. ఇది ఎలా సాధ్యం అవుతుంది? కేవలం వినడం లేదా చదవడం వల్ల కాదు. ఇది మళ్లీ మళ్లీpractice చేయడం ద్వారా feedback తీసుకోవడం ద్వారా నిజమైన జీవిత అనుభవాల్లో పాల్గొనడం ద్వారా ఇది వస్తుంది. అంటే, జ్ఞానం మాటల్లో కాదు…జీవితంలో ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే పూర్తి అవుతుంది.

ప్రదర్శన మరియు సాధన: కార్యరూపంలో జ్ఞానం

జ్ఞానం కేవలం ఆలోచనగా ఉండిపోయినప్పుడు దాని పరిమితులు ప్రదర్శన (performance) లో స్పష్టంగా కనిపిస్తాయి, అదే సమయంలో, నిజమైన జ్ఞానం ఎలా ఉండాలో కూడా ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. నాటకం, సంగీతం, నాట్యం, యుద్ధకళలు ఇవి కేవలం వినోదం లేదా ప్రదర్శన కోసం మాత్రమే కాదు. ఇవి నిజానికి జ్ఞానం నేర్చుకునే మరియు చూపించే స్థలాలు. ప్రదర్శనలో అర్థం చేసుకోవడం అలాగే వెంటనే చర్యగా కనిపించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం. అక్కడ ఇక్కడ సిద్ధాంతం (theory) మరియు ఆచరణ (practice) వేర్వేరు కాదు—రెండూ ఒకటే. ఒక నటుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు “ఇప్పుడు నేను ఏమి చేయాలి? అని ఆలోచించడానికి సమయం ఉండదు. ఒక నర్తకి ప్రతి కదలిక గురించి లెక్కించదు. ఒక సంగీతకారుడు ప్రతి స్వరం గురించి ఆలోచించడు. వాళ్లు వెంటనే స్పందిస్తారు. ఎందుకంటే వాళ్లకు జ్ఞానం తలలో మాత్రమే లేదు— శరీరంలో స్థిరపడింది.

ఈ స్థాయి జ్ఞానం ఎలా వస్తుంది?
ఇది ఒక్కరోజులో రాదు.

ఇది పునరావృతమైన సాధన (practice) ద్వారా, తప్పులు సరిదిద్దుకోవడం ద్వారా, మళ్లీ మళ్లీ మెరుగుపరుచుకోవడం ద్వారా వస్తుంది. ఈ విషయం గురించి Aristotle చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మాటల్లో, “మహత్తరమైన పనులు ఒక్కసారి చేసే చర్యలు కాదు; అవి అలవాట్లుగా మారిన చర్యలు.” ఇప్పటి పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయి. ఎక్కువ స్థాయి నైపుణ్యం (skill) రావాలంటే, కేవలం తెలుసుకోవడం సరిపోదు—సరైన విధంగా సాధన చేయాలి (deliberate practice). ప్రదర్శనలో చేసే సాధన యంత్రంలా (mechanical) పునరావృతం కాదు. అది ఒక మార్పు ప్రక్రియ.

అంటే, మనం తెలుసుకున్నది మెల్లిగా
మన చూపు (perception),
మన ఉద్దేశం (intention),
మన చర్య (action)
ఇవి అన్నీ కలిసేలా మారాలి. అప్పుడు మాత్రమే జ్ఞానం పూర్తిగా మనలో స్థిరపడుతుంది.

కాబట్టి చివరికి చెప్పాల్సిన విషయం ఒకటే—
జ్ఞానం అంటే తెలుసుకోవడం కాదు…
అది కార్యరూపంలో కనిపించడం.

భారతీయ జ్ఞాన వ్యవస్థ మరియు సాంప్రదాయాలతో అనుసరణ

ఇప్పుడు మనం “శరీరంతో కలిసిన జ్ఞానం” గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇది కొత్త ఆలోచన కాదు. చాలా కాలం ముందే భారతీయ జ్ఞాన సంప్రదాయాలు ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్నాయి. Upanishads వంటి గ్రంథాల్లో “జ్ఞానం (జ్ఞానము)” అంటే కేవలం అర్థం చేసుకోవడం కాదు. అది ఒక అనుభవం, ఒక మార్పు. అంటే, మనం ఎలా చూస్తాం, ఎలా ఆలోచిస్తాం, ఎలా జీవిస్తాం—ఇవన్నీ మారాలి. అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం వస్తుంది.

అలాగే Natya Shastra నాటకం మరియు ప్రదర్శనను కేవలం వినోదంగా చూడదు. అది మనిషి అనుభవాలను తెలుసుకునే ఒక శాస్త్రీయ విధానం అని చెబుతుంది. ఇక్కడ జ్ఞానం మాటల ద్వారా కాదు, శరీరంతో వ్యక్తం చేయడం ద్వారా వస్తుంది. ఇంకాYoga Sutras of Patanjali లో ఒక ముఖ్యమైన విషయం చెప్పబడింది. జ్ఞానం అనేది ఒక్కసారిగా రావడం కాదు. అది నిరంతర సాధన (abhyāsa) మరియు అసక్తి (vairāgya) ద్వారా వస్తుంది. ఇక్కడ ముఖ్యమైనది concepts నేర్చుకోవడం కాదు—మన చైతన్యం (consciousness) మారడం. జ్ఞానానికి శరీరం రెండోది కాదు—అదే ముఖ్యమైన భాగం అని ఈ సంప్రదాయాలు ఈ ముఖ్యమైన విషయాన్ని మనకు చెబుతున్నాయి.

మన ఆలోచన (thinking), మన చర్య (doing), మన జీవనం (being)—ఇవి వేర్వేరు కాదు. ఇవన్నీ ఒకటే వ్యవస్థలో భాగాలు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఇది పాత సంప్రదాయాలకు తిరిగి వెళ్లడం కాదు. ఇది మనకు ఒక కొత్త దారి చూపుతుంది—ప్రస్తుతం ఉన్న సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలో. ఇది మనకు ఆలోచించడం మరియు చేయడం మధ్య ఉన్న దూరం సహజమైనది కాదు. అది మనం నిర్మించుకున్న ఒక విధానం మాత్రమే అని చెబుతుంది. అందువల్ల, జ్ఞానం అంటే ఏమిటి? అది ఎలా మన జీవితంలో కనిపించాలి? అని మనం మళ్లీ ఆలోచించాలి—
ముగింపు: సమగ్ర జ్ఞానం వైపు ఒక మార్పు

శరీరంతో కలిసిపోని జ్ఞానం వల్ల ఏర్పడిన ఈ సమస్య మనకు “జ్ఞానం అంటే అసలు ఏమిటి?” అనే ఒక ముఖ్యమైన ప్రశ్నను మళ్లీ ఆలోచించమంటోంది. జ్ఞానం కేవలం ఆలోచనలలోనే ఉండిపోతే, మన జీవితంలో విభజన కొనసాగుతుంది. మనకు అర్థం అవుతుంది కానీ మనం చేయలేం. మన ఉద్దేశం ఒకటి, మన ప్రవర్తన మరోటి అవుతుంది. మనకు స్పష్టత ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం కష్టమవుతుంది. అందుకే ఆలోచనను వదిలేయడం కాదు. దాన్ని మన అనుభవంతో, మన జీవనంతో కలపడం మనకు అవసరం.

జ్ఞానం నిజంగా రావాలంటే, అది సాధన (practice) ద్వారా పెరగాలి, జీవితంలో అనుభవంతో పరీక్షించబడాలి, మన శరీరంలో, మన ప్రవర్తనలో స్థిరపడాలి. ఈ మార్పు కేవలం విద్యలో మాత్రమే కాదు, మన ఉద్యోగాల్లో ఎలా శిక్షణ ఇవ్వడంలో మారుతుంది. మన సంస్థలను ఎలా నిర్మించడంలో మారుతుంది. మనిషి ఎలా అభివృద్ధి చెందాలీ అనే విషయంలో మన అర్థం కూడా మారుతుంది. ఇలా చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఇది సమాచారం (information) నుంచి మార్పు (transformation) వైపు, ఆలోచన (abstraction) నుంచి అనుభవం (embodiment) వైపు మనల్ని ఒక కొత్త దిశలో ఆలోచించమంటుంది.

ఇప్పుడు “మనకు ఏమి తెలుసు?” అని అడగడం కాదు. అసలు “మనలో జ్ఞానం ఎలా రూపం దాల్చుతోంది?” అని అడగాలి. అంటే, అది ఆలోచనగా మొదలై చేయగలిగే శక్తిగా ఎలా మారుతోంది? మన జీవితంలో నిజంగా ఎలా కనిపిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, మనకు జ్ఞానం అంటే జీవించడం అని చెప్పిన జ్ఞాన సంప్రదాయాలను చూడాలి. అక్కడ జ్ఞానం కేవలం ఆలోచన కాదు…అది మన ఆచరణ మన జీవితం.

error: Content is protected !!