The Crisis of Disembodied Knowledge: Why ThinkingWithout Action is Failing Us డిసెంబాడీడ్ నాలెడ్జ్ (మూర్తీభవించని లేదా ఆచరణలో లేని) జ్నానం యొక్క సంక్షోభం: చర్య లేని ఆలోచన మనల్ని ఎందుకు విఫలం చేస్తోంది – డా. సాయి ఆచార్య

ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది, కానీ అది ప్రభావం చూపడం తగ్గిపోతుంది. ఆలోచనలు అనుభవం కంటే వేగంగా పాకుతున్నాయి, అవగాహన పెరుగుతోంది కానీ మార్పు రావడం లేదు, తెలుసుకోవడం చర్యగా మారడం లేదు. ఇదేడిసెంబాడీడ్ నాలెడ్జ్అనే సమస్యఅంటే ఆలోచించడమే జీవించడం అని భావించడం, తెలుసుకోవడంతోనే ఆగిపోయి చేయడంలోకి మారకపోవడం. విద్యలో, పాలనలో, రోజువారీ జీవితంలో మనం విషయాలను బాగా చెప్పగలుగుతున్నాం, కానీ వాటిని నిజంగా పాటించడం లేదా జీవించడం లేదు. అందుకే మనకు తెలిసినదానికి, మనం ఎలా జీవిస్తున్నామన్నదానికి మధ్య పెద్ద అంతరం ఏర్పడుతోంది.

Conscious Action Training (చైతన్యమైన చర్య) (CAT) దృష్టిలో పరిష్కారం స్పష్టంగా ఉంది కానీ సులభం కాదు: జ్ఞానం మళ్లీ శరీరంతో, ప్రస్తుత క్షణంతో, చర్యతో కలవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్యలను ఎదుర్కోవాలంటే, ప్రవర్తనలో మార్పు తీసుకురాని జ్ఞానం సరిపోదుఅది అసంపూర్ణమే.

Introduction: The Paradox of Knowing More, Living Less
పరిచయం: ఎక్కువ తెలుసుకుంటూ, తక్కువగా జీవించడం అనే విరుద్ధ పరిస్థితి

మనిషి చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా సమాచారం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. కొన్ని క్లిక్స్ తోనే తత్వశాస్త్రం, న్యూరోసైన్స్, థియేటర్, పాలసీలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు—అన్నీ తెలుసుకోవచ్చు. జ్ఞానం అనుభవం కంటే వేగంగా పాకుతోంది; ఆలోచనలు ప్రపంచమంతా తిరుగుతున్నాయి, కానీ అవి మన జీవనంలో అంతగా కనిపించడం లేదు. అయినప్పటికీ, అంత జ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచంలోఆందోళన పెరుగుతోంది, మనుషుల మధ్య దూరం పెరుగుతోంది, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది, మరియు ఒక మౌనమైన నైతిక స్థంభన కనిపిస్తోంది. ఇది తెలియకపోవడం వల్ల వచ్చిన సమస్య కాదు. ఇది డిసెంబాడీడ్ నాలెడ్జ్ లేదా ఆచరణలో లేని జ్ఞానం అనే సమస్య.
మనకు తెలుసు—కాని మనం చేయడం లేదు.
మనకు అర్థమవుతోంది—కాని మార్పు రావడం లేదు.
మనము ఆలోచిస్తున్నాం—కాని ఆచరణలో పెట్టడంలేదు, ప్రస్తుతంలో ఉండటం లేదు.
Conscious Action Training (చైతన్యమైన చర్య) (CAT) దృష్టిలో ఇది చిన్న గ్యాప్ కాదు. ఇది జ్ఞానం ఎలా తయారవుతుంది, ఎలా పంచబడుతుంది, ఎలా జీవించబడుతుంది అన్న దానిలో ఉన్న ఒక నిర్మాణాత్మక లోపం. అసలు సమస్య ఏమిటంటే—జ్ఞానం శరీరం, చర్య, మరియు జీవత అనుభవం నుండి వేరుపడిపోయింది.

What is Disembodied Knowledge?
డిసెంబాడీడ్ నాలెడ్జ్ (మూర్తీభవించని లేదా ఆచరణలో లేని) అంటే ఏమిటి?

డిసెంబాడీడ్ నాలెడ్జ్ (ఆచరణలో లేని జ్ఞానం) అంటే మనం తెలుసుకునే జ్ఞానం కేవలం మనసులోనే ఉండిపోవడం. అది ఆలోచనల రూపంలో, మాటల రూపంలో ఉండొచ్చు కానీ అది మన అనుభవంలోకి, మన సంబంధాలలోకి, మన చర్యల్లోకి మారదు. అంటే అది చెప్పగలిగే జ్ఞానం కానీ చేయలేని జ్ఞానం; వ్యక్తపరచగలిగే జ్ఞానం కానీ జీవించలేని జ్ఞానం. ఇక్కడ మహాభరతంలో దుర్యోధనున్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు కాని ఆచరణలో పెట్టడం చేతకాదు. ఇప్పుడు ప్రస్తుత ప్రపంలో చాలా మంది పరిస్తితి ఇదే అనిపిస్తుంది.

ఈ పరిస్థితికి చారిత్రక కారణం ఉంది. ముఖ్యంగా René Descartes అనే తత్వవేత్త మనసు మరియు శరీరాన్ని వేరు చేశాడు. ఆయన “నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను” అని చెప్పినప్పుడు, కేవలం మన అస్తిత్వాన్ని మాత్రమే కాదు, జ్ఞానాన్ని కూడా కొత్తగా నిర్వచించాడు. దాని తర్వాత జ్ఞానం అనేది మనసులో జరిగే ప్రక్రియగా మారింది. అది శరీరం నుండి, చర్య నుండి క్రమంగా దూరమైంది. ఈ విధానం శాస్త్రం, తత్వశాస్త్రం అభివృద్ధికి చాలా సహాయపడింది. కానీ దీని వల్ల ఒక పెద్ద పరిణామం జరిగింది—జ్ఞానం నిజమైన జీవితం నుండి దూరమైంది. ఆలోచించడం చేయడంపై అధిక ప్రాధాన్యం పొందింది.

గమనించడం పాల్గొనడంపై ముందుకు వచ్చింది. ప్రాతినిధ్యం అనుభవాన్ని మించినది అయింది. ఇంకొకవైపు, ఆసియా, ఆఫ్రికా మరియు స్థానిక సంప్రదాయాలలో జ్ఞానం వేరే విధంగా అర్థం చేసుకున్నారు. అక్కడ జ్ఞానం అనేది ఆచరణ, సంప్రదాయం, మరియు శరీరంతో కలిసినది. అక్కడ తెలుసుకోవడం అంటే చేయడం, పాల్గొనడం, జీవించడం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ రెండు విధానాలలో మొదటిదాని ఆధిపత్యం వల్ల మరియు రెండో విధానం పక్కకు నెట్టబడటం వల్ల వచ్చింది.

The Symptoms of Disembodied Knowledge
డిసెంబాడీడ్ (మూర్తీభవించని లేదా ఆచరణలో లేని) నాలెడ్జ్ లక్షణాలు

ఈ విడిపోయిన జ్ఞానం ప్రభావం మన జీవితంలోని అనేక రంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, తెలుసుకోవడం మరియు చేయడం మధ్య ఉండే పెద్ద గ్యాప్ దీనిలో ముఖ్యమైనది. ఉదాహరణకు క్లైమేట్ చేంజ్ తీసుకుంటే, శాస్త్రవేత్తలందరూ ఒకే మాట చెబుతున్నారు, ప్రణాళికలు ఉన్నాయి, పాలసీలు కూడా ఉన్నాయి, ప్రజల్లో అవగాహన కూడా ఉంది. అయినప్పటికీ, మన ప్రవర్తనలో పెద్ద మార్పు కనిపించడం లేదు. సమస్య ఏమిటంటే—మనకు సమాచారం లేదు కాబట్టి కాదు, మనం అనుభవంగా దాన్ని జీవించడం లేదు. జ్ఞానం ఉంది, కానీ అది మన రోజువారీ జీవితంలో చర్యగా మారడం లేదు.

ఇదే పరిస్థితి మన భావోద్వేగ మరియు మానసిక అంశాల్లో కూడా కనిపిస్తోంది. మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కానీ అనుభవం తక్కువగా ఉంటోంది. డిజిటల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ నిజంగా ఒంటరితనం పెరుగుతోంది. మనసు ఎప్పుడూ పని చేస్తోంది, కానీ శరీరం మాత్రం అంతగా పాల్గొనడం లేదు. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కానీ మన భావాలను నిజంగా అనుభవించడం, శరీరం ద్వారా వాటిని మార్చుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా ప్రపంచ అవగాహన కూడా ఒక ప్రదర్శనగా మారింది. మనుషులు మంచి విషయాల గురించి మాట్లాడుతున్నారు, న్యాయం, పర్యావరణం, ఆరోగ్యం వంటి విషయాల్లో తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ అవి ఎక్కువగా మాటల్లోనే ఉంటున్నాయి. అవి జీవితంలో నిరంతరంగా కనిపించడంలేదు.

ఈ పరిస్థితిని CAT (చైతన్యమైన చర్య) “స్ప్రుహతో జరిగే చర్యలాగ కాకుండా కేవలం ఆలోచనాతో జరిగే ప్రదర్శన”గా చూస్తుంది. విద్యా వ్యవస్థ కూడా ఈ సమస్యను మరింత పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు జ్ఞాపకం పెట్టుకోవడం, స్పష్టంగా ఆలోచించడం, పరీక్షల్లో బాగా రాయడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థులు విశ్లేషించడం, అర్థం చేసుకోవడం, వివరించడం నేర్చుకుంటున్నారు. కానీ వారి ధ్యాస, ప్రస్తుతంలో ఉండడం, నైతికంగా స్పందించడం, సంబంధాలను నిర్మించడం వంటి విషయాల్లో ఎక్కువగా శిక్షణ పొందడం లేదు. అందుకే వారు బాగా చదివినవారిగా బయటకు వస్తున్నారు కానీ వారి జ్ఞానం జీవనాన్ని మార్చే స్థాయికి చేరడం లేదు.

Theoretical Foundations: Beyond the Mind–Body Split
సిద్ధాంతాత్మక పునాది: మనసు–శరీరం విభజనకు ఆవల

డిసెంబాడెడ్ నాలెడ్జ్ అనే సమస్యను చాలా మంది ఆలోచనాపరులు గుర్తించారు. వివిధ రంగాల్లో ఉన్న శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు—అందరూ కలిసి “తెలుసుకోవడం, ఉండటం, చేయడం” మధ్య ఉన్న సంబంధాన్ని మళ్లీ ఆలోచించడానికి ప్రయత్నించారు. కాగ్నిటివ్ సైన్స్‌లో Francisco Varela మరియు అతని సహచరులు “embodied” మరియు “enactive cognition” అనే ఆలోచనను ప్రవేశపెట్టారు. వారి ప్రకారం, ఆలోచన అనేది కేవలం మెదడులో జరిగే ప్రక్రియ కాదు. అది మన శరీరం, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మరియు మన చర్యల మధ్య జరిగే పరస్పర సంబంధం ద్వారా ఉద్భవిస్తుంది. అంటే, జ్ఞానం మనం కలిగి ఉండేది కాదు—మనము చేసే పని. అది కదలికలో, అనుభవంలో, ప్రపంచంతో మమేకమయ్యే ప్రక్రియలో బయటపడుతుంది.

సామాజిక శాస్త్రంలో, ముఖ్యంగా Pierre Bourdieu చెప్పిన ఆలోచనలు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తాయి. ఆయన “habitus” అనే భావన ద్వారా మన జ్ఞానం మన శరీరంలో, మన అలవాట్లలో, మన ప్రతిస్పందనల్లో ఎలా నాటుకుపోతుందో వివరించాడు. మనం ఏమి తెలుసుకున్నామో మన మాటల్లో కాదు—మన ప్రవర్తనలో కనిపిస్తుంది. మనం ఎలా కదులుతాం, ఎలా స్పందిస్తాం, ఎలా సంబంధాలు పెంచుకుంటాం అన్నదానిలోనే నిజమైన జ్ఞానం ఉంటుంది. చాలాసార్లు ఈ జ్ఞానం మనకు స్పష్టంగా తెలియకపోయినా, అది మన చర్యల్లో కనిపిస్తూనే ఉంటుంది.

పర్ఫార్మెన్స్ స్టడీస్‌లో Richard Schechner ఒక ఆసక్తికరమైన దృక్కోణాన్ని అందిస్తారు. ఆయన ప్రకారం, మన ప్రవర్తన అనేది “restored behavior”—అంటే మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేసి, పునరావృతం చేసి, మన జీవితంలో భాగమయ్యే చర్యలు. ఈ దృష్టిలో చూస్తే, మన వ్యక్తిత్వం అనేది స్థిరమైనది కాదు; అది మనం చేసే పనుల ద్వారా నిరంతరం రూపుదిద్దుకుంటుంది.

విద్యా రంగంలో, Paulo Freire చాలా స్పష్టమైన విమర్శ చేశారు. ఆయన చెప్పిన “banking model” ప్రకారం, విద్యార్థులకు జ్ఞానం కేవలం నింపబడుతుంది. కానీ ఆయన దీనిని వ్యతిరేకిస్తూ “praxis” అనే భావనను ప్రతిపాదించాడు—అంటే ఆలోచన మరియు చర్య కలిసి ఉండే ప్రక్రియ. చర్య లేకుండా ఆలోచన అసంపూర్ణం. ఆలోచన లేకుండా చర్యకు దిశ ఉండదు. ఈ అన్ని దృక్కోణాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి: జ్ఞానం అనేది చర్య నుండి వేరుగా ఉండదు. అది మనం చేసే ప్రక్రియలోనే పూర్తి అవుతుంది.

CAT Perspective: Knowledge as Conscious Action
CAT దృష్టిలో: జ్ఞానం అంటే చైతన్యంతో చేసే చర్య

Conscious Action Training (చైతన్యమైన చర్య) (CAT) ఈ సమస్య ఉన్న చోటే జోక్యం చేస్తుంది. ఇది జ్ఞానాన్ని తిరస్కరించదు, ఆలోచన ప్రాముఖ్యతను కూడా తగ్గించదు. కానీ జ్ఞానం పూర్తవ్వడం అంటే ఏమిటో కొత్తగా నిర్వచిస్తుంది. CAT (చైతన్యమైన చర్య) ప్రకారం, జ్ఞానం పూర్తి అవ్వాలంటే అది చైతన్యంతో కూడిన చర్యగా మారాలి. ఈ మార్పు ఒక ముఖ్యమైన అవగాహనతో మొదలవుతుంది—చర్య జరిగేది కేవలం ప్రస్తుత క్షణంలోనే. మన ఆలోచనలు ఎక్కువగా గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఉంటాయి. మనం గుర్తుచేసుకుంటాం, ఊహిస్తాం, ప్లాన్ చేస్తాం. ఇవన్నీ ప్రస్తుతంలోనే జరుగుతున్నప్పటికీ, మన దృష్టిని ప్రస్తుత
అనుభవం నుండి దూరం చేస్తాయి. అందుకే మనం తెలుసుకున్నదాన్ని చేయడంలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది.

CAT ఈ సమస్యను సరిచేయడానికి మన దృష్టిని “ఇప్పుడే” అనే క్షణంపై మళ్లిస్తుంది. అక్కడే జ్ఞానం నిజంగా చర్యగా మారుతుంది. ఇక్కడ చర్య అనేది తొందరపాటు కాదు; అది జాగ్రత్తగా, స్పష్టంగా, పరిస్థితికి తగిన విధంగా స్పందించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో శరీరానికి ముఖ్యమైన స్థానం ఉంటుంది. CAT (చైతన్యమైన చర్య) లో శరీరాన్ని ఒక సాధనంగా కాకుండా, ఒక జ్ఞాన స్థలంగా చూస్తారు. మన కదలికలు, హావభావాలు, శ్వాస, రిధమ్—అన్నీ జ్ఞానం రూపాలే. ఇవి జ్ఞానానికి తర్వాత వచ్చే విషయాలు కాదు; ఇవి జ్ఞానం ఎలా ఏర్పడుతుందో చూపించే మార్గాలు.

ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే—అవగాహన ముందుగా రాదు. అది చర్య ద్వారా అభివృద్ధి చెందుతుంది. మనం చేస్తూ ఉంటేనే మనకు స్పష్టత వస్తుంది. ఇంకా ముఖ్యంగా, CAT (చైతన్యమైన చర్య) ఆలోచన, భావం, చర్య ఈ మూడింటిని కలిపి చూడాలి అని చెబుతుంది. డిసెంబాడీడ్ నాలెడ్జ్ (ఆచరణలో లేని జ్ఞానం) వీటిని విడదీస్తుంది—ఆలోచన మాత్రమే ఉండటం, భావం మాత్రమే ఉండటం, లేదా చర్య మాత్రమే ఉండటంగా చూస్తుది. కానీ CAT (చైతన్యమైన చర్య) వీటిని ఒకటిగా కలిపి, మనం ఆలోచించే విధానం, మనం అనుభవించే భావాలు, మనం చేసే చర్య—అన్నీ ఒకే దిశలో ఉండేలా చేస్తుంది. అప్పుడు మాత్రమే మన జీవితం సమగ్రంగా మారుతుంది.

Embodiment in Practice
ప్రాక్టీస్‌లో ఎంబాడిమెంట్ (మూర్తీభవించిన)

డిసెంబాడీడ్ నాలెడ్జ్ (ఆచరణలో లేని జ్ఞానం) నుంచి ఎంబాడెడ్ నాలెడ్జ్‌కి (మూర్తీభవించిన లేదా ఆచరణాత్మక జ్ఞానంగా) మారడం అనేది కేవలం ఆలోచనల్లో జరిగేది కాదు; అది పూర్తిగా ఆచరణలో జరిగే ప్రక్రియ. ఇది చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఉదాహరణకు, Augusto Boal ప్రభావంతో వచ్చిన అప్లైడ్ థియేటర్‌లో, పాల్గొనేవారు సామాజిక సమస్యలను కేవలం చర్చించరు. వారు వాటిని enact (అభినయం) చేస్తారు—పాత్రల్లోకి ప్రవేశిస్తారు, పరిస్థితుల్లోకి దిగుతారు, శరీరంతో స్పందిస్తారు, తమ చర్యల ఫలితాలను అనుభవిస్తారు. ఇక్కడ జ్ఞానం ఎవరో చెప్పేది కాదు; పాల్గొనడం ద్వారా మనమే సృష్టించేది.

మెడికల్ విద్యలో కూడా ఇదే మార్పు కనిపిస్తోంది. simulation-based training (అనుకరణ-ఆధారిత శిక్షణ) ద్వారా విద్యార్థులు నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో పని చేస్తారు. అక్కడ వారికి కేవలం టెక్నికల్ నైపుణ్యం సరిపోదు. భావాలను నియంత్రించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, పరిస్థితిని అర్థం చేసుకోవడం—అన్నీ అవసరం. ఈ నైపుణ్యం చదివడం ద్వారా రాదు; చేస్తూ నేర్చుకోవాలి. అలాగే ధ్యాస వంటి సాధనలు కూడా లోతుగా చూస్తే శరీరానికి ప్రాధాన్యం ఇస్తాయి. శ్వాస, శరీర భంగిమ,
ఇంద్రియాలపై దృష్టి పెట్టడం ద్వారా మన అవగాహన మన శరీరంతో కలుస్తుంది. అప్పుడు అవగాహన ఒక ఆలోచనగా కాకుండా ఒక జీవ అనుభవంగా మారుతుంది. ఈ అన్ని ఉదాహరణల్లో ఒకే విషయం స్పష్టంగా కనిపిస్తుంది—జ్ఞానం నిజంగా మార్పు తీసుకురావాలంటే అది చర్యగా మారాలి. అది మనం చేస్తేనే అది మన జీవితాన్ని మార్చగలదు.

The Political and Cultural Stakes
రాజకీయ మరియు సాంస్కృతిక ప్రభావాలు

డిసెంబాడీడ్ నాలెడ్జ్ (ఆచరణలో లేని జ్ఞానం) సమస్య వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ఉండదు; అది సమాజం, సంస్కృతి, పాలన వంటి పెద్ద రంగాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది ఎమ్పతి (సానుభూతి) లేని పాలసీలను, బాధ్యతలేని నాయకత్వాన్ని, స్థిరత్వం లేని అభివృద్ధిని తీసుకువస్తుంది. వ్యవస్థలు బాగా ఆలోచించి రూపకల్పన చేయబడుతున్నాయి, కానీ అవి నిజ జీవితంలో అమలు చేయడంలో తరచుగా విఫలమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక స్పష్టమైన అవగాహన పెరుగుతోంది—ప్రత్యేకంగా “well-being” వంటి కొత్త విధానాలలో—డేటా మాత్రమే సమాజాన్ని మార్చలేదని.

నిజమైన మార్పు రావాలంటే మనుషుల ప్రవర్తన మారాలి. ఆ ప్రవర్తనా మార్పు రావాలంటే, జ్ఞానం శరీరంతో, ఆచరణతో కలవాలి. ఇక్కడే CAT (చైతన్యమైన చర్య) కు రాజకీయంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత వస్తుంది. ఇది నాయకులను కేవలం పాలసీల గురించి ఆలోచించే మరియు రూపొందించే వాళ్లుగా కాకుండా, వాటిని తమ జీవితంలో ఆచరించేలా తయారు చేసే విధానాన్ని అందిస్తుంది. అలాగే పౌరులను కేవలం అవగాహన గురించి మాట్లాడేవారిగా కాకుండా, దాన్ని నిజంగా ఆచరించేలా మారుస్తుంది. ఇది పాలనను కేవలం సమాచార ఆధారంగా కాకుండా, అనుభవం మరియు ఆచరణ ఆధారంగా మార్చే దిశగా తీసుకెళ్తుంది.

Toward a New Epistemology
కొత్త జ్ఞాన దృష్టికోణం వైపు

డిసెంబాడీడ్ నాలెడ్జ్ (ఆచరణలో లేని జ్ఞానం) అనే ఈ సమస్యను పరిష్కరించాలంటే చిన్న చిన్న మార్పులు సరిపోవు. జ్ఞానం అంటే ఏమిటి అనే విషయాన్నే మళ్లీ కొత్తగా అర్థం చేసుకోవాలి. ఇది తెలియకపోవడం నుంచి తెలుసుకోవడం వైపు మార్పు కాదు; ఇది ఆలోచనల నుంచి ఆచరణ వైపు, ప్రాతినిధ్యం నుంచి పాల్గొనడం వైపు, అవగాహన నుంచి చైతన్యంతో చేసే చర్య వైపు మార్పు. ఈ మార్పు జ్ఞాన విలువను తగ్గించదు; దానిని ఇంకా లోతుగా చేస్తుంది. జ్ఞానం అనేది కేవలం మన దగ్గర ఉండే విషయం కాదు, అది జీవం పొందేది—మన దృష్టి, మన చర్యలు, మన సంబంధాల ద్వారా. ఈ విధంగా చూస్తే, జ్ఞానం ఒక స్థిరమైన వస్తువు కాదు; అది
నిరంతరం మారుతూ ఉండే ఒక జీవ ప్రక్రియగా మారుతుంది.

Conclusion: The Urgency of Embodiment
ముగింపు: మూర్తీభవించిన లేదా ఆచరణాత్మక జ్ఞానం అత్యవసరం

విద్య, పాలన, కళలు, సమాజం—ఈ అన్ని రంగాల్లో భవిష్యత్తు ఈ మార్పుపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న “మనకు ఏమి తెలుసు?” కాదు; “మనకు తెలిసినదాన్ని మనం ఎలా ఆచరిస్తున్నాము అలాగే జీవిస్తున్నాం?” అనేదే. Conscious Action Training (చైతన్యమైన చర్య) (CAT) ప్రస్తుత పరిస్థితిని విమర్శించడమే కాదు, ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఇది మనం ఎలా జీవించాలో ఒక కొత్త విధానాన్ని సూచిస్తుంది—ఆలోచన భూమికి దగ్గరగా ఉండాలి, చర్య చైతన్యంతో ఉండాలి, జ్ఞానం జీవంతో నిండాలి.

జ్ఞానం శరీరం ద్వారా ప్రవహించకపోతే అది అసంపూర్ణంగా మిగులుతుంది. అది చర్యగా మారకపోతే అది నిష్క్రియంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలలో డిసెంబాడీడ్ నాలెడ్జ్ (ఆచరణలో లేని జ్ఞానం) అనేది చాలా పెద్ద సమస్యగా తయారయింది. దానిని మార్చడానికి ఇలా నిష్క్రియంగా ఉన్న జ్ఞానం ఇక సరిపోదు, ఎంబాడీడ్ నాలెడ్జ్  మూర్తీభవించిన లేదా ఆచరణాత్మక జ్ఞానం) కావాలి.

error: Content is protected !!